విద్వేషాలు పెరిగిపోయిన ప్రస్తుత సమాజానికి రామానుజాచార్యుల సమతా సిద్ధాంతం అత్యవసరమని చినజీయర్ స్వామి (Tridandi Chinajiyarswamy) అభిప్రాయపడ్డారు. నేటి నుంచి తమ ఆశ్రమంలో చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తునట్లు త్రిదండి చినజీయర్‌స్వామి ప్రకటించారు. 2022 ఫిబ్రవరి 5న ప్రధాని(pm modi) చేతుల మీదుగా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ చేయనున్నట్లు త్రిదండి చినజీయర్‌స్వామి ప్రకటించారు. ఫిబ్రవరి 2-14 వరకు సమతామూర్తి కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఫిబ్రవరి 14న పూర్ణాహుతిలో రాష్ట్రపతి (president) పాల్గొంటారన్నారు.
రామానుజాచార్యులు సమసమాజ స్థాపనకు పూనుకున్నారని చినజీయర్ స్వామి అన్నారు. శ్రీరామానుజాచార్యులకు వెయ్యేళ్లు పూర్తయ్యాయని... సమతా సిద్ధాంతాన్ని రామానుజులు లోకానికి చాటారని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. ఫిబ్రవరిలో 12 రోజులపాటు రామానుజాచార్యుల ఉత్సవాలు నిర్వహిస్తామని... రూ. 1200 కోట్లకుపైగా వ్యయంతో ప్రపంచంలో రెండో అతిపెద్ద పంచలోహ విగ్రహం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
120 కిలోల బంగారంతో నిత్యారాధాన విగ్రహం ఏర్పాటు చేస్తామని.. 12 రోజులు రోజుకు కోటిసార్లు నారాయణమంత్రం పఠనం ఉంటుదన్నారు. కార్యక్రమంలో 5వేల మంది రుత్వికులు పాల్గొంటారని...128 యాగశాలల్లో హోమం చేస్తామన్నారు.
1017లో రామానుజాచార్యులు అవతరించి 121 ఏళ్లపాటు భూమిపై ఉన్నారు. ఆయన సమతాస్ఫూర్తిని ఎంతో మంది మేధావులు అంగీకరించారు. చిన్న వయసులోనే ఆయనలో అద్భుత ప్రతిభాపాటవాలు ఉండేవి. రామానుజాచార్యులు కేవలం పండితులే కాదు.. అద్భుతమైన ప్రజ్ఞాశాలి. సమతా సిద్ధాంతాన్ని లోకానికి చాటిన మహనీయులు- చినజీయర్ స్వామి
ఇదీ చూడండి: RTC CHAIRMAN BAJIREDDY: 'ఆర్టీసీ ఆదాయాన్ని పెంచి పూర్వ వైభవం తెస్తాం..'