రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి 21వ వర్ధంతిని పురస్కరించుకుని.. ఇంద్రారెడ్డి నగర్లోని ఆయన విగహ్రానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు.
ప్రత్యేక రాష్ట్రం.. ఇంద్రారెడ్డి కల అని గుర్తు చేస్తూ, వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని సబితా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో.. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతోందని వివరించారు. కౌకుంట్లలోని ఇంద్రారెడ్డి సమాధి వద్ద.. కుమారులు ఇతర కుటుంబసభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు.. జోహార్ ఇంద్రన్న అంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వర్షాలు