ETV Bharat / state

దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణలో ఉంది: శ్రీనివాస్​ గుప్తా - Charkha Mahotsavam

Charakha Mahotsav at Hayatnagar : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్​ ప్రతిష్టాన్​ల ఆధ్వర్యంలో చరఖా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టూరిజం ఛైర్మన్​ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు.

Charkha Mahotsav at Hayatnagar
చరఖా మహోత్సవం వేడుకలు
author img

By

Published : Dec 30, 2022, 3:41 PM IST

Charakha Mahotsav at Hayatnagar : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లోని ఒక ఫంక్షన్ హాల్​లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్​ల ఆధ్వర్యంలో ఘనంగా చరఖా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టూరిజం ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 1000 మంది విద్యార్థులు గాంధీయవాదంతో మహాత్మా గాంధీ వేషధారణలతో గొప్పతనాన్ని చాటుతూ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు.

60 సంవత్సరాల సుధీర్ఘ పోరాటంలో తెలంగాణ రావడానికి కేసీఆర్ కూడా అంతే కష్టపడ్డారని.. స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీజీ ఎంతో గొప్పవారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని, చేనేత కార్మికులకు కూడా పింఛన్లు, పథకాలు ఇస్తున్నారన్నారు. కేసీఆర్​ను తెలంగాణ గాంధీ అని కొనియాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణలో ఉందని, చేనేత కార్మికులకు ఉపాధి చూపిస్తూ బతుకమ్మ చీరలు, నేతలకు పథకాలు ఇవ్వడం జరుగుతుందని శ్రీనివాస్ గుప్తా తెలిపారు.

కొంతమంది బీజెేపీ నాయకులు గాడ్సేను పొగుడుతున్నారని, బీజెేపీ నాయకులకు ఇది సరికాదని అన్నారు. 140 కోట్ల మంది సుఖంగా, సంతోషంగా ఉన్నామంటే అందుకు కారణం గాంధీజీ బ్రిటీశ్​ వారిని తరిమి కొట్టడమే అని గుర్తు చేశారు. అలాంటి గాంధీని చంపిన గాడ్సేను సమర్థించడం సరికాదని ఉప్పల శ్రీనివాస్ గుప్తా హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఛైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, యానాల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

"మహాత్మాగాంధీ మన దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిన గొప్ప నేత. వైశ్యజాతిలో పుట్టి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విగ్రహాలు పెట్టుకునే గొప్ప ఖ్యాతిని సంపాదించారు. చరఖా ఉద్యమాన్ని నిర్వహించడం చాలా గర్వంగా ఉంది."- ఉప్పల శ్రీనివాస్​ గుప్తా, టూరిజం ఛైర్మన్

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఘనంగా చరఖా మహోత్సవం వేడుకలు..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.