ETV Bharat / state

GHMC ACTION: సాహెబ్​నగర్ ఘటన.. అధికారులపై జీహెచ్​ఎంసీ సస్పెన్షన్​ వేటు

రంగారెడ్డి జిల్లా సాహెబ్‌నగర్ మ్యాన్‌హోల్ ఘటన బాధ్యులపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది. ఇద్దరు కార్మికులు మృతిచెందడంతో అసిస్టెంట్ ఇంజినీర్ గౌతమ్‌తో పాటు ఇద్దరు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు వేసింది. డిప్యూటీ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Three officers suspended in the issue of sahebnagar
అధికారులపై జీహెచ్​ఎంసీ సస్పెన్షన్​ వేటు
author img

By

Published : Aug 7, 2021, 4:55 AM IST

రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్‌ ఘటనకు బాధ్యులైన అధికారులపై జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. ఇద్దరు కార్మికుల మృతికి కారణమైన వారిపై సస్పెన్షన్​ వేేటు వేసింది. అసిస్టెంట్ ఇంజినీర్ గౌతమ్‌తో పాటు ఇద్దరు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు సస్పెన్షన్​కు గురయ్యారు.

నాలుగు రోజుల క్రితం మురుగునీటిలోకి శుభ్రపరిచేందుకు దిగిన శివ అనే కార్మికుడు ఊపిరాడక మృతి చెందాడు. అతన్ని రక్షించేందుకు దిగిన మరో వ్యక్తి అంతయ్య గల్లంతయ్యాడు. నాలుగు రోజులుగా అధికారులు అతని కోసం గాలిస్తున్నా ఆచూకీ మాత్రం కనిపించలేదు. ఈ ఘటనపై అధికారులు, గుత్తేదారు నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జీహెంచ్‌ఎంసి అధికారులు స్పందించారు.

ముగ్గురు అధికారుల సస్పెండ్

ఈ మేరకు అసిస్టెంట్‌ ఇంజినీర్‌ గౌతమి, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌లు శ్రీకాంత్‌ వర్మ, నర్సింహ్మారెడ్డిలను సస్పెండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్దంగా రాత్రి వేళలో కార్మికులతో పనిచేయించి ఎటువంటి భద్రత చర్యలు తీసుకోకపోవడంపై సంబంధిత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, సూపరిండెంట్‌ ఇంజినీర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మరో వ్యక్తి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.

ఇంకా దొరకని అంతయ్య ఆచూకీ!

డ్రైనేజీలో పూడిక తీసేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగి మంగళవారం రాత్రి గల్లంతైన అంతయ్య ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. మృతదేహం కోసం డ్రోన్‌ కెమెరాలు, 300 మంది పురపాలక సిబ్బందితో గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి వెల్లడించారు. 3 బోట్లు, 4 రెస్క్యూ టీంలు, ఎండమాలజీ, ఇంజినీరింగ్‌ సిబ్బందితో కలిసి గాలింపు ముమ్మరం చేశామన్నారు.

బుధవారం ఉదయం నుంచే సహాయక చర్యలను కొనసాగించారు. మొత్తం మూడు మ్యాన్‌హోళ్ల వరకు దాదాపు 300 మీటర్ల దూరాన్ని యంత్రాలతో తవ్వారు. మ్యాన్‌హోళ్ల లోతు 15 అడుగులు ఉండటంతో వాటిని తవ్విన ప్రదేశంలో బావిలాంటి గుంతలు ఏర్పడ్డాయి. అక్కడి పైపులను సైతం బయటకు తీశారు. మూడు మ్యాన్‌హోళ్ల దూరంలో ఎక్కడా గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభించలేదు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధికారులతో కలిసి కుంట్లూరు సమీపంలోని పసుమాముల చెరువులో పడవలను తెప్పించి వెతికించారు. పద్మావతి బ్యాంకు కాలనీ నుంచి ఉన్న పైపులు సామనగర్‌ ట్రంకులైనుకు కలుస్తుంది. గల్లంతైన వ్యక్తి అందులోకి వెళితే అక్కడి నుంచి కుంట్లూరు మీదుగా పసుమాముల చెరువుకు ఈ లైను కలుస్తుంది. దీంతో చెరువులో గాలించినా ఆచూకీ లభించలేదు.

ఇదీ చూడండి: GHMC: 'మ్యాన్​హోల్​లోకి దిగిన ఇద్దరూ మా సిబ్బంది కాదు'

GHMC: మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరి గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.