రంగారెడ్ది జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం పండ్ల మార్కెట్ తరలింపుపై వచ్చే వదంతులను నమ్మొద్దని మార్కెట్ కార్యదర్శి నరసింహారెడ్డి తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు మామిడి సీజన్ కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. కమీషన్ ఏజెంట్లతో సమావేశమయ్యామని.. వారు తీసుకొచ్చిన ప్రతిపాదనలపై చర్చించామన్నారు. తరలింపు వదంతులను నమ్మొద్దని, ఈ ఏడాది బాటసింగారంలోనే మామిడి సీజన్ కొనసాగుతుందని కార్యదర్శి స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం నాటికి కోహెడలో మార్కెట్ సిద్ధమవుతుందని.. ఆ దిశగా ఇప్పటికే అధికారులు సన్నద్ధం చేస్తున్నారని తెలిపారు.
మార్కెట్ యార్డుకు సంబంధించిన కమీషన్ ఏజెంట్స్ మార్కెట్‌కు వచ్చి సమస్యను చెప్పారు. మార్కెట్ సీజన్‌కు సంబంధించి పలు సమస్యలు షెడ్డులు నిర్వహించాలని, యార్డుపై వచ్చిన తప్పుడు ప్రచారంపై ఏమైనా వివరణ ఇవ్వండి అని అడిగారు. మామిడి సీజన్‌కు సంబంధించి బడ్జెట్ కేటాయించాం. కావాల్సిన నిర్మాణాలు చేస్తాం. వస్తున్న వదంతలు నమ్మొద్దు. ఈ ఏడాది కూడా ఇక్కడే నిర్వహిస్తాం. -నరసింహారెడ్డి , మార్కెట్ కార్యదర్శి
ఇవి చదవండి: