Thieves who stole money in Rangareddy district: డబ్బులతో పాటు ప్రయాణిస్తున్నప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నమో! ఇంక అంతే సంగతులు. మనల్ని అప్పటి వరకు పరిశీలిస్తున్న దొంగలు అదే అదునుగా చేసుకొని మనదగ్గర ఉన్న నగదును కాజేస్తారు. దొంగతనం చేసేవారు మనల్ని బెదిరించి డబ్బును, బంగారాన్ని.. విలువైన వస్తువులను దోచుకుంటారు. ఈ ప్రయత్నంలో ఒక్కోసారి ఎంతటి ఘోరం చేయడానికైనా దొంగలు వెనకాడరు. ఇలాంటి సందర్భంలోనే ఒకోసారి అమాయకుల ప్రాణాలు పోతాయి.
అందుకే ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా విలువైన వస్తువులతో వెళ్తుంటే మరింత జాగ్రత్త వహించాలి. లేదంటే భారీగా మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో నగలు వ్యాపారి దగ్గర నుంచి దారి దోపిడీ దొంగలు రూ.10 లక్షలు దొంగిలించారు.
బాధితుడి తెలిపిన వివరాల ప్రకారం.. ఓ నగల వ్యాపారి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌లో వస్తున్నాడు. శివరాంపల్లి వద్ద ఆర్టీసి బస్సును దుండగలు అడ్డుకున్నారు. రాజేంద్రనగర్ ఎన్పీఏ జంక్షన్ దగ్గర దారి దోపిడీ దొంగ నేరుగా బాధితుడు కూర్చోన్న సీటు దగ్గరకి వెళ్లి అతని చేతిలో ఉన్న బ్యాగ్‌ను పట్టుకుని పారిపోయాడు.
దుండగుడిని బాధితుడు పట్టుకుంటుండగా అతనిపై కళ్లలో కారం చల్లాడు. అనంతరం కత్తితో బెదిరించి బ్యాగ్‌తో సహా పారిపోయాడు. ఆ బ్యాగ్‌లో రూ.10లక్షలు ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదులో ముగ్గురిపై అనుమానం ఉన్నట్లు బాధితుడు తెలిపాడు.
"నేను సాధారణంగా నారాయణపేట్ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉంటాను. ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ వెళ్తుంటే గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి నా కళ్లలో కారం చల్లి, కత్తితో బెదిరించి బ్యాగ్ పట్టుకెళ్లారు. ఆ బ్యాగ్‌లో రూ.10లక్షలు ఉన్నాయి. వెంటనే పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఫిర్యదు చేశాను." -బాధితుడు
ఇవీ చదవండి: