ETV Bharat / state

విపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవ్: మంత్రి తలసాని - అమీర్​పేట్​ డివిజన్​లో మంత్రి తలసాని ప్రచారం

గ్రేటర్​​ హైదరాబాద్​ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమీర్​పేట్​, సనత్​ నగర్​ డివిజన్లలో అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

thalasani campaigning in santhnagar and ameerpet divisions
వరదసాయంపై భాజపా తప్పుడు ప్రచారం మానుకోవాలి
author img

By

Published : Nov 21, 2020, 12:51 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా శనివారం తన సొంత నియోజకవర్గం సనత్​నగర్​, అమీర్​పేట్​ డివిజన్లలో తలసాని పాదయాత్ర నిర్వహించి ఇంటింటి ప్రచారం చేశారు.

వరద సాయంలో భాజపా నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తలసాని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వరద సాయం.. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయంలో భాజపా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.

మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​తో కలిసి అభ్యర్థుల ప్రచారం

అనంతరం అమీర్​పేట్​ డివిజన్ అభ్యర్థి శేషకుమారి, సనత్ నగర్ డివిజన్ అభ్యర్థి కొలను లక్ష్మికి మద్దతుగా తలసాని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఇదీ చదవండి: పార్టీ మారే ప్రసక్తే లేదు : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.