TS Inter results: ఇంటర్ బోర్డు నిర్ణయాలు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒత్తిడి పెంచుతున్నాయి. మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులకు ఏప్రిల్‌లో వార్షిక పరీక్షలతో పాటు రాసుకోవాలని ఇంటర్ బోర్డు తెలిపింది. గతంలో ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ రాసుకునే అవకాశం ఉండేది. అయితే తగిన సమయంలో లేకపోవడంతో ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలతో పాటు మొదటి సంవత్సరంలో ఫెయిలైన సబ్జెక్టులు రాసుకోవాలని తెలిపింది. సరైన బోధన లేకపోవడం సకాలంలో పరీక్షలు జరగక పోవడం వల్లే భారీగా ఉత్తీర్ణత తగ్గిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇంటర్ బోర్డు వివరణ ఇచ్చింది.
అన్ని సౌకర్యాలు కల్పించాం
కొవిడ్ తీవ్రత వల్ల మార్చిలో మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించలేక పోయామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిచడంతో పాటు ఫిబ్రవరి 1 నుంచి మార్చి 23 వరకు రోజు విడిచి రోజు ప్రత్యక్ష బోధన జరిపామన్నారు. సిలబస్‌ను 70శాతానికి కుదించడంతో పాటు ప్రశ్నల్లో ఛాయిస్ పెంచి పరీక్షలు జరిపామని జలీల్ పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఇంటర్ బోర్డు వెబ్ సైట్, యూట్యూబ్ ఛానెల్‌లో మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచామని వివరించారు. విద్యార్థుల్లో పరీక్షల భయం తొలగించేందుకు సైకలాజిస్టులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
రుసుము తగ్గింపు
Inter 1st year re verification fee: మూల్యాంకనం, ఫలితాల ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా జరిపినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఫలితాలపై ఎలాంటి ఫిర్యాదులు, అభ్యంతరాలు లేవని పేర్కొన్నారు. విద్యార్థులకు అనుమానం ఉంటే రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొని జవాబు పత్రాన్ని పొందవచ్చునని సూచించారు.విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఏప్రిల్ లో మరోసారి రాసుకోవచ్చునని జలీల్ తెలిపారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు రీవెరిఫికేషన్ రుసుము 50శాతం తగ్గించినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. రీవెరిఫికేషన్ రుసుమును 600 రూపాయల నుంచి 300 రూపాయలకు తగ్గించారు.
Board on ts inter supplementary exams: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కేవలం 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 59 వేల 242 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. అందులో జనరల్ విద్యార్థులు 4 లక్షల 9 వేల 911 కాగా... ఒకేషనల్ విద్యార్థులు 49 వేల 331 మంది ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేనివిధంగా కేవలం 49శాతం విద్యార్థులే ఉత్తీర్ణలయ్యారు. బాలికలు 56 శాతం పాస్ కాగా.. బాలురలో 42 శాతమే ఉత్తీర్ణులయ్యారు.
ఇవీ చదవండి: Intermediate Results in TS: పరీక్ష తప్పిన వారిలో.. సర్కారు విద్యార్థులే అధికం
inter first year exams : ఏప్రిల్‌లో మరోసారి ఫస్టియర్ పరీక్షలు రాయొచ్చు: ఇంటర్ బోర్డు