ETV Bharat / state

25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.. జ్ఞాపకాలు పంచుకున్నారు - students

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ పాఠశాల 1993-94 బ్యాచ్​ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సిల్వర్​ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులంతా కలిసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.

25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.. జ్ఞాపకాలు పంచుకున్నారు
author img

By

Published : Nov 19, 2019, 5:26 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ పాఠశాల పూర్వవిదార్థుల సమ్మేళనం(1993-94) సిల్వర్ జూబ్లీ వేడుకలు చేవెళ్లలోని శ్రీవెంకటేశ్వర గార్డెన్ లో ఘనంగా జరిగాయి. సుమారు 100 మంది పూర్వ విద్యార్థులంతా కలిసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఒకే చోట అందరూ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు.
రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తమ స్నేహితుడి కుటుంబానికి తోటి స్నేహితులు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. స్నేహితులంతా ఎవరికి కష్టం వచ్చినా... ఆపదలో ఉన్నా చేయూతనివ్వాలని అన్నారు..ఈ కార్యక్రమంలో తమకు విద్యాబోధనలు నేర్పించిన చిన్న నాటి గురువు విశ్వనాథ్ గుప్తాను ఘనంగా సన్మానించారు.

25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.. జ్ఞాపకాలు పంచుకున్నారు

ఇవీ చూడండి: కేసీఆర్ తీరుతో ఆర్టీసీ మరింత నష్టపోతోంది: భట్టి

Tg_hyd_28_13_jaggareddy_PC_AB_3038066 Reporter: Tirupal Reddy Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది. ( ) ఆత్మహత్యల రాష్ట్రంగా తెలంగాణ మారిందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవని సీఎం కేసీఆర్ పలు సందర్భాలలో చెప్పారన్నారు. ఒకవైపు రైతుల ఆత్మహత్యలు, మరోవైపు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణ గా మారిందని ధ్వజమెత్తారు. 39రోజులు ఆర్టీసీ సమ్మె జరగడం ఇదే మొదటి సారని ఎప్పటికి ముగుస్తుందో తెలియడం లేదన్నారు. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా... సమస్య పరిష్కారం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ జీతాలు ఉన్న ఆర్టీసీ కార్మికులు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.ఆవుల నరేష్ అనే ఆర్టీసీ కార్మికుడు ఈ ఉదయం ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. ఉద్యమాలకు రాష్ట్రంలో విలువలేకుండా పోయిందని...కళ్ళుండి చూడలేని గుడ్డి ప్రభుత్వం ఇదని ఆరోపించారు. బలహీనుడికి... బలవంతునికి మధ్య జరుగుతున్న పోరాటం...భగవంతుడు ఎవరిని గెలిపిస్తాడో చూద్దాం. ఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులు కనపడటం లేదని కేవలం సీఎం కేసీఆర్ మాటలను బలపరుస్తున్నారని ధ్వజమెత్తారు. స్వామిగౌడ్ , మమత, రవీందర్ , దేవీప్రసాద్ ,మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎక్కడని ప్రశ్నించారు. వారంతా ప్రభుత్వానికి చెంచాగిరి చేసుకుంటూ బతుకుతున్నారని ఆరోపించారు. బైట్: జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.