ETV Bharat / state

'రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని వెనక్కి తీసుకోవాలి'

రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్​ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్​లోని వనస్థలిపురంలో కొత్త పీఆర్సీ పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు.

State government should take back PRC immediately  demand by telangana pensioners jac
'రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని వెనక్కి తీసుకోవాలి'
author img

By

Published : Jan 27, 2021, 8:23 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ ఛైర్మన్​ లక్ష్మయ్య అన్నారు. ఈ ఉత్తర్వులను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్​లోని వనస్థలిపురంలో పీఆర్సీ ప్రకటన ఉత్తర్వులను దహనం చేశారు.

పీఆర్సీపై సీఎం ముగ్గురు అధికారులను నియమించినా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ప్రభుత్వం నుంచి 63 శాతం ఫిట్​మెంట్ వస్తుందని ఆశించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పట్ల పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రం అంటూనే పెన్షనర్ల సదుపాయాల పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇదీ చూడండి : 43 శాతం ఫిట్‌మెంట్‌ కంటే తగ్గకుండా ఇవ్వాలి : ఉద్యోగ సంఘాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.