రంగారెడ్డి జిల్లా అంబర్పేట్ పరిధిలోని డీడీకాలనీలోని శ్రీచైతన్య కళాశాలలో తాగునీటిలో బల్లిపడింది. ఆనీరు తాగడం వల్ల కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద ఆందోళన చేపట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులకు నచ్చచెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు.
ఇవీచూడండి: తేలు కాటుతో విద్యార్థి మృతి