ETV Bharat / state

Women Loco Pilots: మనోధైర్యమే బలం.. లోకో పైలట్లుగా రాణిస్తున్న అతివలు.! - Women Loco Pilots in scr

Women Loco Pilots: ఆటో మొదలుకుని అంతరిక్షం వరకు అన్ని రంగాల్లోనూ అతివలు తమ సత్తా చాటుతున్నారు. సవాళ్లను స్వీకరిస్తూ... కష్టతరమైన కొలువుల్లోనూ ప్రతిభ కనబరుస్తున్నారు. దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. ఆ రైళ్లను సైతం నడపడంలో మహిళలు భాగస్వామ్యం అవుతున్నారు. నిర్ధేశించిన లక్ష్యాలకు సకాలంలో రైళ్లను చేర్చుతూ మహిళా లోకో పైలట్లు కీలకపాత్ర పోషిస్తూ.. తామేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమైనా.. సమయస్ఫూర్తితో ముందుకెళ్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేలో లోకో పైలట్లుగా రాణిస్తున్న నారీమణులపై "ఈటీవి భారత్" ప్రత్యేక కథనం.

women loco pilots
మహిళా లోకో పైలట్లు
author img

By

Published : Mar 8, 2022, 3:18 PM IST

లోకోపైలట్లుగా రాణిస్తున్న అతివలు

Women Loco Pilots: రైళ్లను నడపడమంటే ఆషామాషీ కాదు. శారీరకంగా బలంగా, దృఢంగా ఉండాలి. రైలు బోగీలు విడిపోతే వాటిని తిరిగి దగ్గరికి చేర్చి… గమ్యానికి చేర్చాల్సిన బాధ్యత లోకోపైలట్ల మీదనే ఉంటుంది. పురుషులకైనా ఇది సవాల్‌తో కూడుకున్న ఉద్యోగం. కానీ అటువంటి పనిలో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. మానసిక దృఢత్వం ముందు ఎంతటి పనైనా సులభమేనని నిరూపిస్తున్నారు.

చిన్న నిర్లక్ష్యమైనా.. భారీ మూల్యం

నిత్యం లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. వారంతా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతున్నారంటే... దాని వెనక లోకో పైలట్ల పాత్ర అత్యంత కీలకమైంది. చిన్న నిర్లక్ష్యం జరిగినా... భారీ మూల్యం చెల్లించక తప్పదు. అపారమైన ప్రాణ, ఆర్థిక నష్టానికి కారణమవుతారు. విధుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సవాల్​తో కూడుకున్న ఉద్యోగం కావడంతో లోకో పైలట్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రతీక్షణం పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. సిగ్నలింగ్ వ్యవస్థలకు అనుకూలంగా ముందుకెళ్తూ... రైళ్లను సకాలంలో గమ్యస్థానానికి చేర్చడంలో కీలకభూమిక పోషిస్తున్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత తమపై ఉండటం గర్వంగా ఉందంటున్నారు మహిళా లోకోపైలట్లు.

సవాలుతో కూడుకున్న ఉద్యోగం ఇంది. అయినప్పటికీ చాలా ఇష్టంతో చేస్తున్నాం. ఈ ఉద్యోగంలో శారీరకంగా చాలా దృఢంగా ఉండాలి. ప్రజల ప్రాణాలు కాపాడే ఉద్యోగంలో ఉండటం దేవుడి వరం అనుకుంటాను. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. -లక్ష్మీదేవి, అసిస్టెంట్​ లోకో పైలట్​

ఈ ఉద్యోగంలో భయం అనేది కచ్చితంగా ఉంటుంది. మా ప్రాణం కన్నా ప్రయాణికుల ప్రాణాలు కాపాడటం ముఖ్యమని భావిస్తాం. సవాలుతో కూడుకున్న ఉద్యోగమైనా.. చేయగలం అనుకుంటే ఏ పనైనా చేయగలం. తనూజ, అసిస్టెంట్​ లోకో పైలట్​

కాపాడే ఉద్యోగం

ఒకప్పుడు రైలును చూసి మురిసిపోయిన తామే … అంతపెద్ద బండిని నడపడం గర్వంగా ఉంటుందని మహిళలు చెబుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా.. ధైర్యంగా ముందుకెళ్తామని చెబుతున్నారు. తమకు దేవుడు అందరినీ కాపాడే ఉద్యోగం ఇచ్చాడని భావిస్తున్నామని చెబుతున్నారు. ఇంజిన్​ను అప్పగించేటప్పుడు కచ్చితంగా అన్ని పరిశీలించిన తర్వాతనే ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఇంజిన్​లో ఎలాంటి లోపమున్నా... దాన్ని గుర్తించాల్సిన బాధ్యత లోకో పైలట్ మీదనే ఉంటుందని వెల్లడించారు. ఎంతో మంది ప్రాణాలు తమ భుజ స్కందాలపై ఉండటంతో.... ఎంతటి కష్టమైనా... అది తమ బాధ్యత ముందు చిన్నగానే కనిపిస్తుందని అంటున్నారు.

"మా నాన్న ఆటో డ్రైవర్. చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. నేను లోకో పైలట్ అవడం చాలా సంతోషంగా ఉంది. రైల్వేలో ఉద్యోగం చేయాలనేది నా లక్ష్యం. ఏదైనా వినూత్నంగా చేయాలనేది నా కోరిక. ఈ జాబ్​తో చాలా సంతోషంగా ఉంది. అమ్మాయిలు ఇలాంటి పనులు చేయలేరంటారు. కానీ తలచుకుంటే ఏ పనైనా సమర్థంగా చేయగలం." -రమ్య, అసిస్టెంట్ లోకోపైలట్

"ఇంజిన్​ను అన్నీ చెక్​ చేసుకున్న తర్వాతే.. బోగీలకు కనెక్ట్​ చేయాలి. అన్నీ పూర్తయ్యాక.. ప్రయాణికులు రైలు ఎక్కుతారు. వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది." -శ్వేత, అసిస్టెంట్​ లోకో పైలట్​

మహిళ అంటే కేవలం వంటింటికే పరిమితం కాదు. దేశంలోని రాష్ట్రాలను చుట్టొచ్చే రైళ్లను అవలీలగా నడపగలదు అని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. పట్టుదల, గుండె ధైర్యం ఉంటే ఏ పనీ మహిళకు అసాధ్యం కాదని లోకో పైలట్లు చాటుతున్నారు. ఆసక్తి ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని తోటి వనితలకు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: KTR About Women Entrepreneurs : 'మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనలు ప్రపంచస్థాయిలో ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.