ETV Bharat / state

Sirpurkar Commission: సిర్పూర్కర్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా ఆందోళన - దిశ ఎన్‌కౌంటర్‌

Sirpurkar Commission: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ బృందం షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లిలో పర్యటించింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంతో పాటు దిశ మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్ని బృందం పరిశీలించింది. అధికారుల పర్యటన నేపథ్యంలో స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్‌ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Sirpurkar Commission
షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లిలో సిర్పూర్కర్ కమిషన్ బృందం
author img

By

Published : Dec 5, 2021, 7:06 PM IST

Sirpurkar Commission:రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్‌పై విచారణ చేస్తున్న సిర్పూర్కర్ కమిషన్... ఆ ఘటన జరిగిన ప్రాంతంలో పర్యటించింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్, దిశ మృతదేహం దహనం చేసిన స్థలాలను బృందం సభ్యులు పరిశీలించారు. భారీ భద్రత మధ్య కమిషన్ సభ్యులు పర్యటించారు. దాదాపు ఒక గంటపాటు ఘటన జరిగిన ప్రాంతంలో ఉండి ఆరా తీశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పీఎస్‌లో మరిన్ని వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. అయితే కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పీఎస్‌ ఎదుట వివిధ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.

Sirpurkar Commission
సిర్పూర్కర్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా ఆందోళన

పీఎస్ ఎదుట ప్రజాసంఘాల ఆందోళన

shadnagar ps: కమిషన్ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సమాచారం అందుకున్న ప్రజా, యువజన సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. పీఎస్ వద్దకు చేరుకుని కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే కమిషన్‌ను రద్దు చేయాలని పీఎస్ ఎదుట బైఠాయించారు. కమిషన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో షాద్ నగర్‌ పోలీసులు ఆందోళనకారులను నిలువరించారు.

తొండుపల్లికి కమిషన్

sirpurkar commission in thondupalli: ఒకవైపు ఆందోళనలు కొనసాగుతుండగానే కమిషన్ సభ్యులు... దిశను హత్యాచారం చేసిన శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలో గల ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్లిపోయారు. అక్కడ దిశ తన ద్విచక్ర వాహనంతో నిలిచి ఉన్న ప్రాంతంతో పాటు ఆమెను అత్యాచారం చేసిన ప్రదేశాన్ని వారు పరిశీలించారు. కాగా చటాన్‌పల్లిలో పోలీసులు మీడియాను అనుమతించలేదు. 2019 డిసెంబరు 6న చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.