రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఘటనాస్థలిని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా పరిశీలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నెల రోజుల్లోనే నేరస్థులకు ఉరి శిక్ష పడేలా చూడాలన్నారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్నందునే శాంతిభద్రతలకు విఘాతం కల్గుతోందని అభిప్రాయపడ్డారు. విపరీతంగా సాగుతున్న మద్యం అమ్మకాలను నియంత్రించాలని కోరారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : 'మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం ఉన్నా... లేనట్టే'