నిషేదం విధించిన చైనా టపాసులు అమ్మినా... కాల్చినా... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని తన కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసే టపాసుల దుకాణ యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో అనుమతి పొందాలని సూచించారు. క్రాకర్స్ దుకాణ యజమానులు అగ్నిమాపక జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ తెలిపారు.
ఇవీ చూడండి: ఏటీఎంలలో స్కిమ్మింగ్ యంత్రాలు.. విదేశీయుల అరెస్ట్..