కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న వేణు గౌడ్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పీసీసీ సభ్యుడు వేణు గౌడ్ ప్రారంభించారు. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారని ఆయన తెలిపారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో విశ్వేశ్వర్‌రెడ్డి సోదరీమణులు పాల్గొన్నారు. ఇప్పటికే కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున వారు ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గౌతమి రెడ్డి, శంషాబాద్ మండల కేంద్రంలో అపర్ణలు ఇద్దరు అన్నకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. విశ్వేశ్వర్ రెడ్డిని ఎంపీగా గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని వేణు గౌడ్ కోరారు.
ఇవీ చూడండి:ఐదేళ్లలో చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది: బీబీ పాటిల్