ప్రభుత్వ, ప్రైవేటు అధికారులతో కలిసి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలంతా కృషి చేయాలని షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్ కె. నరేందర్ కోరారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ దామోదర్, పట్టణ సీఐ నవీన్‌తో కలిసి పురపాలక కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.
పట్టణంలోని ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలను పాటించాలని నరేందర్ సూచించారు. వార్డుల్లో వ్యాధి నివారణకు చేపట్టే పనులకు పూర్తి మద్దతిస్తామని తెలిపారు. వ్యాక్సిన్‌తో వ్యాధిని అరి కట్టవచ్చని దామోదర్ వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలను కొనసాగించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఇదీ చదవండి: తెలంగాణలో ఈ ఏడు విస్తారంగా వర్షాలు