ETV Bharat / state

Rains in Hyderabad: గుంతపల్లి-మజీద్‌పూర్ మార్గంలో వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

Rains in Hyderabad, hyderabad rains 2021
హైదరాబాద్​లో వాన, భాగ్యనగరంలో వర్షం 2021
author img

By

Published : Oct 9, 2021, 9:17 AM IST

Updated : Oct 9, 2021, 9:58 AM IST

09:13 October 09

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గుంతపల్లి వద్ద వాగులో ఆగిన బస్సు

హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి వరుణుడు(Rains in Hyderabad) బీభత్సం సృష్టించాడు. చంపాపేట్, సరూర్‌నగర్‌ పరిధిలో(hyderabad rains) భారీ వాన కురిసింది. చంపాపేట్ రెడ్డి కాలనీలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సరూర్‌నగర్ కోదండరాం నగర్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సీసల బస్తీ, కమలానగర్, వీవీనగర్‌లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. 

వాగులో ఆర్టీసీ బస్సు

హయత్‌నగర్ బంజారాకాలనీ, అంబేడ్కర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. బాలాపూర్ చౌరస్తాలోని లెనిన్ నగర్‌లో ఇళ్లలోకి వరద చేరింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గుంతపల్లి వద్ద వాగులో ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. గుంతపల్లి-మజీద్‌పూర్ మార్గంలో వాగులో చిక్కుకుంది.

ట్రాఫిక్ జామ్

భాగ్యనగరంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి(Rains in Hyderabad) హైదరాబాద్‌- బెంగళూరు రహదారిపై వరద నీరు భారీగా నిలిచింది. నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఓ లారీ బ్రేక్‌ డౌన్‌ అయి వరదనీటిలో చిక్కుకుంది. ఫలితంగా హైదరాబాద్‌- బెంగళూరు మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రహదారికి ఇరువైపులా 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరాంఘర్‌- శంషాబాద్‌ రహదారిపై కూడా వరద నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

నగరం నడిసంద్రం

మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి నగరం(hyderabad rains 2021) తడిసి ముద్దైంది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులుతో కూడిన వర్షం పడగా మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వాన పడింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దసరా పండుగకు స్వగ్రామలకు వెళ్ళేందుకు రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు బస్సు బయల్దేరే సమయానికి చేరుకోలేక గంటల తరబడి వర్షంలేనే అవస్థలు పడ్డడారు.

అధికారులు అప్రమత్తం

భారీ వర్షాల కారణంగా అప్రమత్తం అయిన జీహెచ్ఎంసీ(GHMC), డీఆర్‌ఎఫ్ బృందాలు(DRF TEAMS) రంగలోకి దిగి సహయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నీరు నిలిచి ప్రాంతాల్లో వాటిని క్లియర్ చేశారు. నగరంలో రాత్రి 11 గంటల వరకూ నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి మహేశ్వరంలో 14 సెంటీమీటర్లు, సరూర్ నగర్ 13, నందిగామ 12, సైదాబాద్ 12, ఎల్బీనగర్ 11, హయత్ నగర్ 11, మహంకాల్ 10, సరూర్ నగర్ విరాట్ నగర్ 10, చార్మినార్ 10, బడ్లగూడ 10, శంషాబాద్ 10, బహదూర్ పురా 10, రాజేంద్ర నగర్ 9, ఫరూక్ నగర్ 9, ఇబ్రహీంపట్నం 8 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.

ఇవీ చదవండి: 

Last Updated : Oct 9, 2021, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.