రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండలం కర్కస్ తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. జంగారెడ్డి పల్లికి చెందిన గుమ్మడయ్య, రాంపూర్‌కు చెందిన మహేశ్‌లు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మల్లయ్య, శివ, రాము అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆమనగల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్‌కు తరలించారు.
ఘటనాస్థలానికి బంధువులు, స్థానికులు చేరుకుని విలపించడం పలువురిని కంట తడి పెట్టించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.