రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్తుండగా రాళ్లగూడ ఔటర్‌రింగ్‌రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులో ఉన్న బాల్‌రెడ్డి, నర్సింహలు అక్కడికక్కడే మృతి చెందారు. శంకర్ అనే మరో వ్యక్తి తీవ్రగాయాలపాలవ్వగా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.