హైదరాబాద్ ఎల్బీనగర్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లో పోలీసు సిబ్బందికి ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు కొవిడ్ టీకాల పంపిణీ ఇవాళ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీకా పంపిణీ కేంద్రాన్ని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరిశీలించారు.
వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన పోలీసు సిబ్బంది కుటుంబాలను, డాక్టర్లను, పారామెడికల్ సిబ్బందితో ఆయన సంభాషించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 12 వేల మంది కుటుంబ సభ్యులకు పైగా టీకాలు వేయించుకోనున్నట్లు సీపీ తెలిపారు. పోలీసు కుటుంబాలకు టీకా సౌకర్యం కల్పించినందుకు రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లాల డీఎంహెచ్‌వోలకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్, ఏసీపీ ట్రాఫిక్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Eatala: ఈటల నివాసానికి తరుణ్ చుగ్‌తో పాటు భాజపా నేతలు