సమాజంలో పెరిగిన అత్యాచారాలను అరికట్టేందుకు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ జటాయివు సేనాని ఏర్పాటు చేశారు. మెుదటి జటాయివుగా నదీం అనే వ్యక్తిని నియమించారు. గతంలో కార్వాన్ ప్రాంతంలో10 ఏళ్ల బాలికను ద్విచక్రవాహనంపై అపహరిస్తున్న సమయంలో ఆమెను కాపడినందుకు అతన్ని నియమించామని చెప్పారు. అతన్ని భక్తుల ఆధ్వర్యంలో అభినందించి సన్మానించారు.
ఇదీ చూడండి:'అనర్హత వేటుపై అత్యవసర విచారణకు విజ్ఞప్తి'