Pre Lok Adalat at hyderabad: రంగారెడ్డి జిల్లా కోర్టుతో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో ప్రీలోక్ లోక్ అదాలత్ ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని.. మరికొందరు మాస్కు ధరించలేదని సీపీ అన్నారు. వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేశామని గుర్తు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఒక్కొక్కరి వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. దీంతో చాలా మంది చెల్లించలేదని వారందరిపై కేసులు పెండింగ్‌లో ఉండిపోయాయని చెప్పారు. అలాంటి వారు లోక్ అదాలత్‌లో వంద రూపాయలు చెల్లిస్తే కేసులు కొట్టివేస్తారని సీపీ పేర్కొన్నారు.
ఈ నెల 12 వ తేదీ వరకు జాతీయ మెగా లోక్ అదాలత్ కొనసాగనున్నట్టు సీపీ వెల్లడించారు. కక్షిదారులు ముందుకొచ్చి రాజీ పడితే కేసులను మూసివేసే అవకాశం ఉందన్నారు. గత సంవత్సరం నిర్వహించిన లోక్ అదాలత్‌లో రాచకొండలో 8వేలకు పైగా కేసులు పరిష్కారం అయ్యాయన్న సీపీ.. రాష్ట్రంలోనే ఇది అత్యధికమని వివరించారు.
ఇదీ చదవండి: పలువురు ఐపీఎస్‌లకు తాత్కాలిక పోస్టింగ్‌లు