ETV Bharat / state

ప్రభుత్వ భవనానికి రాజకీయపార్టీ రంగులు సరికావు: సీపీఎం - cpm leaders on govt buildings color

ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీల రంగులు వేయడాన్ని సీపీఎం తీవ్రంగా తప్పుబట్టింది. గ్రామపంచాయతీ భవనానికి పార్టీ రంగులు వేయటాన్ని రంగారెడ్డి జిల్లా లోయపల్లి గ్రామ సీపీఎం నేతలు ఖండించారు.

ప్రభుత్వ భవనానికి రాజకీయపార్టీ రంగులు సరికావు: సీపీఎం

author img

By

Published : Aug 15, 2020, 9:54 AM IST

గ్రామపంచాయతీ భవనానికి పార్టీ రంగులు వేయటాన్ని రంగారెడ్డి జిల్లా లోయపల్లి గ్రామ సీపీఎం నేతలు ఖండించారు. ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీల రంగులు వేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నామని ఆ పార్టీ నేత చెరుకు గణేశ్ తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా...వ్యవహారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్​లో గ్రామ పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేయటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి దృష్టి సారించాలని... వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పంచాయతీరాజ్​ శాఖ కార్యదర్శితో పాటు కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.