Police Raid on Bigg Boss Beauty Himaja House Party : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో జేబీ వెంచర్‌లోని ఓ విల్లాలో లిక్కర్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో మహేశ్వరం ఎస్‌వోటీ పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో విల్లా బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి హిమజ(Bigboss Himaja)కు చెందినదిగా గుర్తించారు. శాసనసభ ఎన్నికల వేళ ఎన్నికల నియమావళి ప్రకారం పెద్ద పెద్ద డీజే శబ్ధాలు, లిక్కర్ పార్టీ నిర్వహించకూడదు. అయితే వీటిపై నిషేధం ఉండడంతో ఎవరో ఇచ్చిన సమాచారంతో 15 లీటర్ల లిక్కర్ సహా డీజే సిస్టమ్‌ను మహేశ్వరం ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకుని.. ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హిమజకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
"నేను చాలా హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మొదటిసారి కొత్త ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ అని స్నేహితులు, బంధువులను పిలుచుకొని పార్టీ చేసుకున్నాను. ఎవరో ఏదో అనుకొని కంప్లైంట్ ఇస్తే.. పోలీసులు చెక్ చేసి వెళ్లారు. వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారు. వారికి పూర్తిగా సహకరించాము. పోలీసులు వచ్చి చూసుకున్నారు.. వెళ్లిపోయారు. కొన్ని న్యూస్ యాప్స్, ఛానల్స్‌లో తప్పుగా ప్రచారం చేస్తున్నారని మా బంధువులు, స్నేహితులు కాల్ చేసి చెబుతున్నారు. అందులో రేవ్ పార్టీ అని చెబుతున్నారంటా.. దీపావళి రోజు ఇలాంటి అవాస్తవ వార్తలు ఎందుకు వైరల్ చేస్తున్నారు. మా కుటుంబసభ్యులంతా ఇంట్లోనే ఉన్నాం. మేము అరెస్టు అయి పోలీస్ స్టేషన్‌లో ఉన్నామని, రేవ్ పార్టీ చేసి అరెస్టు అయ్యామని తప్పు వార్తలు వస్తున్నాయి. దీనిపై వరుసగా కాల్స్ వస్తున్నాయి నాకు. మేము ఇంట్లోనే ఉంటున్నాము.. పోలీస్ స్టేషన్‌లో అయితే లేము. దయచేసి ఇలాంటి వార్తలను ఎవరూ పట్టించుకోవద్దు." - హిమజ, నటి
కల్లు తాగిన బిగ్‌బాస్ బ్యూటీ.. 'అఖండ' స్టైల్లో!
Party at Actress Himaja House in Ibrahimpatnam : ఈ లిక్కర్ పార్టీపై స్పందించిన బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి హిమజ దీపావళి సందర్భంగా కొత్త ఇళ్లు నిర్మించుకొని.. స్నేహితులు, బంధువులను పిలిచి పార్టీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. కేవలం దీపావళి పర్వదినాన మాత్రమే స్నేహితులకు పార్టీ ఇస్తున్నానని.. కానీ ఎలాంటి రేవ్ పార్టీ జరగట్లేదని ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. పోలీసులు వారి విధులు నిర్వహించారని.. సోదాల్లో పూర్తిగా వారికి సహకరించామని తెలిపారు. కొన్ని న్యూస్ యాప్స్, వార్తా ఛానల్ వాళ్లు అనవసరంగా తాము అరెస్టు అయి పోలీస్ స్టేషన్‌లో ఉన్నామని చెబుతున్నారు. దయ చేసి అవాస్తవాలు ప్రచారం చేయొద్దని అందరికీ హిమజ విజ్ఞప్తి చేశారు.