ETV Bharat / state

బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డితో సహా నలుగురిపై కేసు నమోదు - మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిపై వేధింపుల కేసు నమోదు

Police Case filed on Ibrahimpatnam Former MLA Kishan Reddy : ఇబ్రహీంపట్నం బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, బెదిరింపుల కేసు నమోదైంది. మున్సిపల్​ ఛైర్‌పర్సన్‌ స్రవంతి ఫిర్యాదు మేరకు కిషన్​రెడ్డితో పాటు ఆయన కుమారుడు సహా పలువురు ప్రభుత్వ ఉద్యోగస్తులపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.

Police Case filed on Ibrahimpatnam Former MLA Kishan Reddy
బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డితో సహా నలుగురిపై కేసు నమోదు
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 10:35 PM IST

Police Case filed on Ibrahimpatnam Former MLA Kishan Reddy : ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, బెదిరింపుల కేసు నమోదైంది. కిషన్​రెడ్డితో పాటు ఆయన కుమారుడు ప్రశాంత్​ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఆమోయ్‌ కుమార్( Amoy Kumar), ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్ కమిషనర్ ఎండీ యూసుఫ్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Complaint Files on Ranga Reddy Former Collector : మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ (Municipal Chairperson) పోస్టు కోసం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి రూ. 2.5 కోట్లు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బుడగ జంగాల కులానికి చెందని తాను మున్సిపల్ ఛైర్‌పర్సన్​గా ఎంపికైన దగ్గరి నుంచి కులం పేరుతో మాజీ ఎమ్మెల్యే కిషన్​రెడ్డి, ఆయన కుమారుడు వేధిస్తున్నారని మున్సిపల్​ ఛైర్మన్​ స్రవంతి ఫిర్యాదులో వివరించారు.

మాజీమంత్రి మల్లారెడ్డి అతని అనుచరులపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Harassment Complaint on Ibrahimpatnam Former BRS MLA : మంచిరెడ్డి కిషన్​రెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్​ కమిషనర్ యూసఫ్​, అప్పటి వైస్​ ఛైర్మన్​కు బాధ్యతలు అప్పగించేందుకు తనను నిత్యం లీవ్ పెట్టాలని బెదిరించారని స్రవంతి తెలిపారు. మాజీ కలెక్టర్​ ఆమోయ్‌ కుమార్ సైతం తనను పిలిచి ఉన్నత కులం వారితో తక్కువ కులం వారు పెట్టుకోవద్దని అన్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. సెలవు పెట్టకపోతే తనను సస్పెండ్​ చేస్తానని రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ బెదిరించారని ఆమె తెలిపారు.

Allegations Of Bribe on Manchireddy Kishan Reddy : మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ స్రవంతి ఫిర్యాదు మేరకు మంచిరెడ్డి కిషన్​రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఆమోయ్‌ కుమార్, ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్ కమిషనర్ ఎండీ యూసఫ్​పై ఎస్సీ ఎస్టీ 504, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. శాసన సభ ఎన్నికల ముందు మున్సిపల్​ ఛైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి బీఆర్​ఎస్(BRS)​ పార్టీ నుంచి కాంగ్రెస్​లో చేరారు. తాజాగా ఆమె పార్టీ మారిన తర్వాత బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డిపై బెదిరింపుల కేసు వేయడం గమనార్హం.

నేను భూకబ్జా చేయలేదు - నాకు అంత అవసరం లేదు : మాజీ మంత్రి మల్లారెడ్డి

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.