తలసేమియా, సికిల్ సెల్మియా వ్యాధిగ్రస్తులకు రక్తం దొరక్కపోవటంతో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో శంషాబాద్‌లో పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పీఎస్ పరిధిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం… సంతోషంగా ఉందని శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు.
రక్తదాన శిబిరంలో స్థానిక ప్రజలతోపాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. లాక్డౌన్ కారణంగా పలు వ్యాధిగ్రస్తులకు రక్తం లభించకపోవడం వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.
అందులో బాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తం సేకరించి వివిధ బ్లడ్ బ్యాంక్‌లకు తరలిస్తామని వారు అన్నారు. ఈ సందర్భంగా రక్తదానంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని పోలీసులు కోరారు. లాక్డౌన్ సమయంలో ఉదయం ఆరు నుంచి ఒంటి గంట వరకు కావల్సిన వస్తువులు తీసుకుని ఇంటికే పరిమితం కావాలని పోలీసులు సూచించారు.
ఇదీ చూడండి: Bandi Sanjay: ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపితే అరెస్టు చేస్తారా?: బండి