ETV Bharat / state

'పండుగ పూట.. ఆర్టీసీ బస్సులకు ఆదరణ కరవు' - Rangareddy Regional Manager

తెలంగాణ ఆర్టీసీ.. దసరా పండుగ కోసం ప్రత్యేకంగా నడిపించిన బస్సులకు ఆదరణ కరవైంది. కరోనా వ్యాప్తి వల్ల ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉందని రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు.

no response for Dussehra special buses by TSRTC
పండుగ పూట.. ఆర్టీసీ బస్సులకు ఆదరణ కరవు
author img

By

Published : Oct 27, 2020, 6:51 PM IST

తెలంగాణలో దసరా పండుగ కోసం ప్రత్యేకంగా నడిపిన బస్సులకు ఆదరణ కరవైందని రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. కరోనా వ్యాప్తి వల్ల పండుగ పూట కూడా రద్దీ తక్కువగా ఉందని వెల్లడించారు. 3వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించి.. కరోనా వ్యాప్తి వల్ల 1,793 బస్సులకు కుదించామని చెప్పారు.

ఈ నెల 15 నుంచి 25 వరకు ఎంజీబీఎస్, జూబ్లీహిల్స్ బస్​ స్టేషన్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్, దిల్​సుఖ్​నగర్​లతో పాటు నగర శివారు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడిపించినట్లు ఆర్​ఎం వరప్రసాద్ తెలిపారు. ఖమ్మం జిల్లాకు 218 బస్సులు, మహబూబ్​నగర్​ జిల్లాకు 151 బస్సులు, ఆదిలాబాద్​ జిల్లాకు 137, నిజామాబాద్ జిల్లా-346, నల్గొండ జిల్లా-469, కరీంనగర్​ జిల్లా-346, మెదక్ జిల్లా-42, వరంగల్ జిల్లా-540 బస్సులు నడిపినట్లు వెల్లడించారు. పండుగ సందర్బంగా నడిపిన ప్రత్యేక బస్సుల్లో ఆక్యూపెన్సీ రేషియో కూడా బాగా తగ్గినట్లు ఆర్​ఎం వరప్రసాద్ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.