ETV Bharat / state

డెంటిస్ట్​ కిడ్నాప్​ కేసు.. నవీన్‌రెడ్డికి 3 రోజుల పోలీస్​ కస్టడీ

author img

By

Published : Dec 23, 2022, 4:46 PM IST

Police Custody to Naveen Reddy : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మన్నెగూడ యువతి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డి మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో నిందితుడిని రేపు ఉదయం నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు పోలీసులు విచారించనున్నారు.

Naveen Reddy
Naveen Reddy

Police Custody to Naveen Reddy : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మన్నెగూడలో యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పోలీస్​ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మొదట ఎనిమిది రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. వాదోపవాదనలు విన్న ఇబ్రహీంపట్నం కోర్టు.. ఒక్క రోజు కస్టడీకి అనుమతి ఇస్తూ.. ఆర్డర్స్ జారీ చేసింది. అయితే ఒక్క రోజు కస్టడీ సరిపోదంటూ పోలీసులు జిల్లా కోర్టుకు వెళ్లగా.. ఈ రోజు విచారించిన కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో నవీన్‌రెడ్డిని రేపు ఉదయం నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు పోలీసులు విచారించనున్నారు.

ఇదీ జరిగింది: అమెరికా పెళ్లి సంబంధం రావడంతో హైదరాబాద్‌ మన్నెగూడకు చెందిన దంత వైద్యురాలికి ఈ నెల 9న తల్లిదండ్రులు నిశ్చితార్ధం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం అనుచరులతో పాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పని చేసే 36 మందిని ముందురోజు రాత్రి మన్నెగూడకు రప్పించాడు.

నవీన్‌ రెడ్డి సహా అంతా ఉదయం 11:30 గంటలకు.. మూడుకార్లు, ఓ డీసీఎంలో మన్నెగూడలోని యువతి ఉండే ఇంటికి చేరుకున్నారు. పథకం ప్రకారం కర్రలు, రాడ్లతో నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్‌ రెడ్డిని అడ్డుకోబోయిన యువతి తండ్రి, బాబాయ్‌పైనా వారు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి సోఫా, ఫర్నీచర్‌ సహా ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు.

ఆ తర్వాత యువతిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన నవీన్ రెడ్డి.. కారులో కూర్చోబెట్టాడు. నవీన్‌ రెడ్డి, రూమెన్, మరో ఇద్దరు కలిసి యువతిని అపహరించుకొని నల్గొండ వైపు పారిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరొకరితో వివాహానికి ఎలా అంగీకరించావని యువతిని కొట్టడంతో.. నుదురు, వీపు, చేతిపై గాయాలయ్యాయి. పోలీసులకు పట్టుబడకుండా మిర్యాలగూడకు వెళ్లే దారిలో.. నవీన్ రెడ్డి, అతని ముగ్గురు స్నేహితులు ఫోన్లు స్విచాఫ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.