అభివృద్ధి-అందుబాటు అన్న నినాదంతో ముందుకు సాగుతూ.. తనను గెలిపించిన ప్రజలకు అన్ని వేళల్లో అందుబాటులోకి ఉంటానని భరోసా ఇచ్చారు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి. ప్రగతి భవన్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది కాలంలో తాను పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలు తదితర అంశాలను కేటీఆర్‌కు వివరించారు.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న దృష్ట్యా... కేటీఆర్‌కు భవిష్యత్తు ప్రగతి ప్రణాళికపై రూపొందించిన నివేదిక సమర్పించారు. ఎంపీ విజ్ఞప్తిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ వెల్లడించారు.