మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ప్రశ్నించే గొంతులకే ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని ఎంపీ పేర్కొన్నారు. తెరాస అభ్యర్థులు ఓటర్లను, ప్రత్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలు తెరాసను నమ్మే పరిస్థితులు పోయాయన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్‌నగర్ కార్పొరేషన్