రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పురపాలిక పరిధిలోని 15 వార్డుల్లో నాలుగు వేల కుటుంబాలకు తెరాస పార్టీ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. ఆ కార్యక్రమానికి నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్య అతిథులుగా నిత్యావసరాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని వారు అన్నారు.
రాష్ట్రంలో నిరుపేదలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వారికి అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ జిల్లా వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : రోడ్డెక్కిన వలస కూలీలు... కాలినడకన 600 మంది పయనం