హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బంది శిక్షణ శిబిరాన్ని రంగారెడ్డి జిల్లా పాలనాధికారి అమోయ్ కుమార్ పరిశీలించారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో సరూర్‌నగర్‌లోని జూనియర్ కళాశాలలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ నెల 14న పోలింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగే విధంగా కృషి చేయాలని ఎన్నికల అధికారులకు కలెక్టర్ సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రెండోసారి నిర్వహించిన శిక్షణకు అధికారులందరూ హాజరైనట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, నోడల్ ఆఫీసర్ కల్యాణి, ఆర్డీవోలు రవీందర్ రెడ్డి, వెంకటాచారి, సరూర్‌నగర్ ఎమ్మార్వో రామ్ మోహన్, పలు మండలాలకు చెందిన వారు ఉన్నారు.