రెండవ విడత పట్టణ ప్రగతిలో భాగంగా శంషాబాద్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాజేంద్రనగర్ ఎమ్యెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
మంచినీటి, మురుగునీటి సమస్యలను త్వరలోనే పరిష్కారిస్తామని ప్రకాశ్ గౌడ్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరే విధంగా ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.