రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో తహసీల్దార్ విజయ రెడ్డి హత్య కారణమైన భూ వివాదం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. నిందితుడి బంధువుల వద్ద భూములు కొనుగోలు చేసిన వాళ్లే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, అతని కుటుంబ సభ్యులు బాచరంలోని సర్వే నంబర్ 71 నుంచి 101 వరకు కోట్ల రూపాయల విలువ చేసే భూమిని వివిధ పేర్లతో పట్టా చేసుకున్నారని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇప్పటికే కొన్ని పత్రాలను సేకరించామని తెలిపారు. భూములపై విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసినట్లు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: అబ్దుల్లాపూర్మెట్లో భూ మాఫియా... రెండు వర్గాలదే హవా