శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్‌గూడకు చెందిన స్నేహలత అనే మైనర్ బాలిక.. ఈనెల 4 నుంచి కనిపించడం లేదు. ఈ మేరకు కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు హిమాయత్‌సాగర్‌లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.
శవాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గతంలో ఎయిర్పోర్ట్ కాలనీకి చెందిన విజయ్ అనే యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేయడం వల్ల.. మనస్తాపానికి గురైన స్నేహలత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.