రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి భూమిపూజ నిర్వహించారు. కొండకల్ శివారులో 100 ఎకరాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించనున్నారు. 2022 నాటికి ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి.
దేశంలోనే అతిపెద్దది...
దేశంలోనే అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు రావడం పట్ల పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాల్లో సంస్థ కార్యకలాపాలు విస్తరించాయన్నారు. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడం శుభపరిణామమన్నారు.
'ఇక్కడ్నుంచే రావాలి'
ఇప్పటికే రైల్వేలో రూ.30 వేల కోట్లతో ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఇక్కడి నుంచే లోకోమోటివ్స్ రావాలని మంత్రి కేటీఆర్ అభిలాషించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఇక్కడి నుంచే లోకోమోటివ్స్ రావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ఒక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీలతోపాటు.. హెలిక్యాఫ్టర్లు, ట్రాక్టర్లు, బస్సులు ఇప్పటికే తయారు అవుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. మేధా సంస్థ ద్వారా తక్కువ ఖర్చుతో ప్రస్తుతం రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు నిర్మాణం జరగనుందని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టులో విచారణ ప్రారంభం