స్వచ్ఛత ఉన్నప్పుడే అన్ని విధాలుగా పల్లెలు అభివృద్ధి చెందుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శంషాబాద్‌లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన 106 గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, జయపాల్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణం