ETV Bharat / state

Errabelli: గ్రామీణ స్థానిక సంస్థలకు నిధుల విడుదలపై మంత్రి ఎర్రబెల్లి హర్షం

గ్రామీణాభివృద్ధికి సీఎం కేసీఆర్​ విశేషంగా కృషి చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు పేర్కొన్నారు. పల్లె ప్రగతి, పారిశుద్ధ్య నిర్వహణతో గ్రామాలు ఆదర్శవంతంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

funds to rural local bodies
గ్రామీణ స్థానిక సంస్థలకు నిధుల విడుదల
author img

By

Published : Aug 21, 2021, 5:23 PM IST

కరోనా మహమ్మారితో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గ్రామీణ స్థానిక సంస్థల‌కు రూ.432కోట్లు విడుద‌ల చేసినందుకు సీఎం కేసీఆర్​కు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృత‌జ్ఞత‌లు తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి నెలా నిధుల‌ు విడుద‌ల చేస్తున్నామ‌ని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ప్రతి నెలా రూ.227.50 కోట్లు విడుద‌ల చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో పంచాయ‌తీల‌కు 210.44కోట్లు, మండ‌ల ప‌రిష‌త్‌ల‌కు 11.41కోట్లు, జిల్లా ప‌రిష‌త్‌ల‌కు 5.65కోట్లు చొప్పున అందిస్తున్నట్లు వివరించారు.

గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు రూ.432 కోట్ల 49 లక్షలు విడుదలయ్యాయి. ఇందులో గ్రామపంచాయతీలకు రూ.182.49 కోట్లు కాగా, మండల పరిషత్‌లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.125.95 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రామపంచాయ‌తీల్లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య‌త ఇస్తోందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలన్న సదుద్దేశంతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు. అందులో భాగంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. మౌలిక సదుపాయల కల్పన, పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యత, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల వల్ల గ్రామాల సమగ్ర స్వరూపమే మారిందని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Kishan Reddy: దేశానికి రాజైనా అంబర్​పేటకు బిడ్డనే: కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.