రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియను నిలిపివేస్తూ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే నిబంధనలను ఉల్లఘించిన్నట్లు కనిపిస్తోందని... రెండో విడత సీట్ల భర్తీ సహా మొత్తం ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అడ్మిషన్ల ప్రక్రియలపై పూర్తి వివరాలను ఈ నెల 13లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది.
550 జీవోను పాటించని కాళోజీ
అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన 550 జీవోకు విరుద్ధంగా ప్రవేశాలు చేశారన్నారు. నిబంధనల ప్రకారం ముందు ఓపెన్ కేటగిరి సీట్లు... అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కేటగిరిని భర్తీ చేయాల్సి ఉందన్నారు. దీనికి భిన్నంగా కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం అధికారులు ముందు రిజర్వేషన్ కేటగిరీ సీట్లను భర్తీ చేశారన్నారు.
మెరిట్ విద్యార్థులకు అన్యాయం
మెరిట్ విద్యార్థులతో రిజర్వేషన్ సీట్లను భర్తీచేయడం వల్ల మిగిలిన రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు అన్యాయం జరిగింది. రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, యూనివర్సిటీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 13వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చదవండిః నేడు తీవ్రరూపం దాల్చనున్న జూడాల ఆందోళన