మొక్కజొన్న పంటకు సోకే కత్తెర పురుగు నివారణలో రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలని అధికారులకు వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా సూచించారు. రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలంలోని మేకగూడ గ్రామంలోని పొలాల్లో తిరిగారు. అక్కడి పంట పరిస్థితుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. సబ్సిడీ విత్తనాలు, అడవి పందుల బెడద, గోదాముల నిర్మాణం, వంటి అంశాలను రైతులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కర్షకుల సమస్యలన్నీ తీరుస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: రవీష్ కుమార్కు 'రామన్ మెగసెసె' అవార్డు