ఎల్బీనగర్ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌లో ఉప ఎన్నిక ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. డివిజన్‌లో 57 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 47,379 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 1 వరకు 18.26 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల అధికారులు... కొవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. భాజపా అభ్యర్థి ఆకుల రమేష్ గౌడ్ ఆకస్మిక మరణం కారణంగా జరుగుతున్న ఉప ఎన్నికలకు అధికారులు, పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికకు తెరాస పోటీ నుంచి తప్పుకుంది.
ఇదీ చూడండి: ప్రశాంతంగా కొనసాగుతోన్న మినీ పుర ఎన్నికల ఓటింగ్