రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లాలో(జీహెచ్‌ఎంసీ మినహాయించి) ఇప్పటివరకు 34 కేసులు రాగా.. అందులో 8 మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అవి కూడా నాలుగు పంచాయతీల్లోనే వెలుగు చూశాయి. శంకర్‌పల్లి మండలం పొద్దటూరులో 2, నందిగామ మండలం చేగూరులో 3, తాళ్లగూడలో 2, మహేశ్వరం మండలం నందుపల్లిలో ఒక కేసు వచ్చింది.
అప్రమత్తత, అవగాహనతో వ్యవహరించారు...
కరోనా వైరస్ విషయంలో గ్రామీణ ప్రాంత ప్రజలు అత్యంత జాగరూకతతో వ్యవహరించారని కలెక్టర్ అమోయ్‌కుమార్ తెలిపారు . లాక్‌డౌన్‌ను పక్కాగా పాటించారని పేర్కొన్నారు. ఆరోగ్య కార్యకర్తలు సర్వేతోపాటు అవగాహన కల్పించారని చెప్పారు. పరస్పర సహకారంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగాం... అనుమానితులను ఇంటికే పరిమితం చేశామని పాలనాధికారి వెల్లడించారు .