ETV Bharat / state

KTR Comments on Congress and BJP : కాంగ్రెస్​ తరఫున గెలిచిన వాళ్లు.. బీజేపీలోకి జంప్‌ అవుతారు: మంత్రి కేటీఆర్ - రేవంత్​రెడ్డిపై కేటీఆర్ విమర్శలు

KTR Comments on Congress and BJP : బీజేపీ వాళ్లు నీళ్ల వాటా తేల్చకుండా నాన్చితే.. కాంగ్రెస్‌ వారు కేసులేసి ఇబ్బంది పెడతారని కేటీఆర్‌ విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఆర్ఎస్​ఎస్​ మనిషి అని సోనియాకు కెప్టెన్‌ అమరేందర్‌ సింగ్‌ లేఖ రాశారని పేర్కొన్నారు. త్వరలోనే పీసీసీ అధ్యక్షుడు బీజేపీలో చేరడం ఖాయమని కేటీఆర్​ వ్యాఖ్యానించారు.

Rangareddy district
KTR
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2023, 4:02 PM IST

KTR Comments on Congress and BJP in Rangareddy District : రంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. షాద్​నగర్ నియోజకవర్గంలో నందిగామ మండలం చాకలిదాని గుట్ట తండా గ్రామ పంచాయతీ భవనాన్ని, కొత్తూరు మండల పరిధిలో కొత్తూరు మున్సిపల్ భవనాన్ని, 60 రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. షాద్​నగర్ పట్టణంలో 1700 డబుల్ బెడ్​ రూమ్ ఇండ్లను ప్రారంభించారు.

KTR Visit to Rangareddy District Today : అనంతరం షాద్​నగర్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ (KTR ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా హామీలతో ప్రలోభపెట్టాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్‌.. ఇవాళ అలవికాని హామీలు ఇస్తోందని దుయ్యబట్టారు. ఓటేస్తే షాద్​నగర్‌లో చందమామను కట్టేస్తా అని ఆ పార్టీ నేతలు హామీలిస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ నాయకులకు, అదానీ నుంచి బీజేపీ నేతలకు డబ్బులు వస్తున్నాయని ఆరోపించారు. వారి వద్ద నుంచి దబాయించి పైసలు తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో రైతుబంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు వస్తేనే బీఆర్ఎస్​కు ఓటు వేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.

KTR Speech in Dharmapuri : 'కాళేశ్వరం కావాలా.. శనీశ్వరం లాంటి కాంగ్రెస్ కావాలా'

తొమ్మిదేళ్లలో ఎన్నో మంచి పనులు చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు. షాద్‌నగర్‌కు నీళ్లు ఇచ్చేది కేసీఆర్‌.. తెచ్చేది అంజయ్య యాదవ్​ అని అన్నారు. ఐదు రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని.. లక్ష్మీదేవిపురం కూడా నిర్మాణం అవుతుందని చెప్పారు. బీజేపీ వాళ్లు నీళ్ల వాటా తేల్చరని.. కాంగ్రెస్‌ వారు కేసులేసి ఇబ్బంది పెడతారని విమర్శించారు. రేవంత్​రెడ్డి ( Revanth Reddy) ఆర్‌ఎస్‌ఎస్‌ మనిషి అని.. ఆ పార్టీ నేతలే చెప్పారని కేటీఆర్ వెల్లడించారు.

KTR Comments on Revanth Reddy : రేవంత్​రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ మనిషి అని.. కెప్టెన్‌ అమరేందర్‌ సింగ్‌ సోనియాకు లేఖ రాశారని కేటీఆర్ పేర్కొన్నారు. తాము తెలంగాణ ప్రజలకు ఏ టీమ్‌గా ఉంటామని చెప్పారు. రేవంత్​రెడ్డి.. బీజేపీతో కలసిపోయారని.. ఎన్నికల తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలోకి జంప్‌ అవడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు.

KTR Inaugurate Vijaya Mega Dairy Plant : అనంతరం కేటీఆర్ మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద తెలంగాణ విజయ ఫెడరేషన్‌కు చెందిన మెగా డెయిరీని ( Vijaya Mega Dairy Plant) ప్రారంభించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో మెగా డెయిరీని నిర్మించారు. దేశంలోనే అత్యాధునిక, ఆటోమేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో.. రోజుకు లక్ష లీటర్ల టెట్రా బ్రిక్ పాల ఉత్పత్తి చేసేలా మిషనరీ ఏర్పాటు చేశారు. పాడి రైతులకు రాష్ట్రప్రభుత్వం లీటర్‌కు రూ.4 ప్రోత్సాహం ఇస్తోందని కేటీఆర్ తెలిపారు.

KTR Comments on PM Modi : 'రాష్ట్రానికి వచ్చి ప్రధాని మోదీ అబద్ధాలు ప్రచారం చేశారు'

పాడి రైతులకు రూ.350 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చామని కేటీఆర్‌ గుర్తు చేశారు. రూ.21,000 కోట్లతో రైతుల రుణాలు మాఫీ చేస్తున్నామని తెలిపారు. రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో రూ.73,000 కోట్లు వేసినట్లు పేర్కొన్నారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ గొప్పగా చెప్పారని.. ప్రధాని చర్యల వల్ల అన్నదాతల ఆదాయం రెట్టింపు అయిందా అని ప్రశ్నించారు. కేంద్రం పెంచిన డీజిల్‌ ధరలతో.. కర్షకుల ఖర్చు రెట్టింపు అయిందని కేటీఆర్ వివరించారు.

"రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చర్యల వల్ల వ్యవసాయం అంటే పండగలా అయ్యింది. వరి దిగుబడిలో పంజాబ్‌ను అధిగమించాం. చేపల పెంపకం, వృద్ధిలో తెలంగాణ ముందుందని కేంద్రమే చెప్తోంది. రాష్ట్రంలో మహోన్నతమైన శ్వేతవిప్లవం రావాలి. ఈ పదేళ్లలో రాష్ట్రంలో ఎన్ని మార్పులు వచ్చాయో ప్రజలు ఆలోచించాలి. ఏదైనా రంగంలో తెలంగాణ వెనక్కుపోయిందేమో ప్రజలు గమనించాలి. దేశంలోని రైతుల ఆదాయం పెరగకపోయినా.. తెలంగాణ రైతుల ఆదాయం పెరిగింది." - కేటీఆర్‌, మంత్రి

KTR Comments on Congress and BJP గెలిచిన కాంగ్రెస్‌ వాళ్లు బీజేపీలోకి జంప్‌ అవుతారు..

Minister KTR Speech at Nirmal BRS Public Meeting : 'మేం అభివృద్ధి చేశామని నమ్మితేనే ఓట్లు వేయండి.. లేకుంటే లేదు..'

KTR Anger Over PM Modi Comments in Nizamabad : కేసీఆర్ ఒక ఫైటర్‌... చీటర్‌తో కలవరు: మంత్రి కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.