రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న క్రికెట్ టోర్నీ ఆదివారంతో ముగిసింది. ఈ టోర్నీలో మొత్తం 40 టీంలు పాల్గొనగా ఫైనల్లో కోహెడ జట్టు విజయం సాధించింది. సెకండ్ ప్లేస్‌లో పటేల్ గూడ జట్టు నిలిచింది.
టోర్నీలో ఫైనల్ మ్యాచ్ నువ్వా నేనా అనే విధంగా రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో మొదటి స్థానంలో నిలిచిన కోహెడ జట్టు ట్రోఫీతో పాటు లక్ష రూపాయల బహుమతిని గెలుచుకుంది. సెకండ్ ప్లేస్‌లో నిలిచిన టీమ్‌కు నిర్వాహకులు ట్రోఫితో పాటు రూ.50వేలు అందించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు దండెం రాంరెడ్డి ఇతర స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచే యువత క్రీడల్లో ముందుండాలని... అలాంటివారికి తమ సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని వక్తలు తెలిపారు.
ఇదీ చూడండి: పురోహిత్ క్రికెట్ లీగ్... పంతుళ్లకు మాత్రమే...!