ETV Bharat / state

KCR Inaugurated Brahmana Sadan : 'పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం' - Gopanpally Latest News

KCR Inaugurated Brahmana Sadan : సర్వజన సమాదరణ, పేదలందరినీ ఆదుకోవాలనేదే ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని ప్రారంభించిన కేసీఆర్.. అర్చకులపై వరాల జల్లు కురిపించారు. వేదశాస్త్ర పండితుల గౌరవభృతిని 5 వేల‌కు పెంచుతున్నట్లు ప్రక‌టించారు. ధూప‌దీప, నైవేద్య ప‌థ‌కాన్ని మరిన్ని ఆలయాలకు విస్తరిస్తున్నట్లు వెల్లడించారు.

kcr
kcr
author img

By

Published : May 31, 2023, 1:51 PM IST

Updated : May 31, 2023, 8:26 PM IST

వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారంగా బ్రాహ్మణ సదన్ విలసిల్లాలి: కేసీఆర్‌

KCR Inaugurated Brahmana Sadan : బ్రాహ్మణ ప‌రిష‌త్‌కు ఏటా వంద కోట్లు కేటాయించి, ఆ నిధుల‌తో అర్చకుల అభ్యున్నతికి వివిధ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా గోప‌న్‌ప‌ల్లిలో 9 ఎక‌రాల స్థలంలో 12 కోట్లతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ‌ స‌ద‌నాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.

వేదపండితుల గౌరవ భృతి రూ.5 వేలకు పెంపు : వేదపండితుల భృతి రెండున్నర వేల నుంచి 5 వేల రూపాయలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ భృతి.. అర్హత వయసును.. 75 నుంచి రూ 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్టు చెప్పారు. ధూప, దీప, నైవేద్యాల పథకం కింద ఇచ్చే నిధిని ఆరు వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచుతున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మ‌రో 2వేల 796 దేవాల‌యాల‌కు ధూప‌దీప నైవేద్యం ప‌థ‌కం విస్తరింప‌జేస్తామన్నారు.

అనువంశిక అర్చకుల స‌మ‌స్యల‌ పరిష్కారానికి సీఎం హామీ : అనువంశిక అర్చకుల స‌మ‌స్యల‌ను త్వర‌లో మంత్రివర్గంలో చ‌ర్చించి శాశ్వత ప‌రిష్కారం చూపుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. బ్రాహ్మణ సదనంలో సమగ్ర గ్రంథాలయంతో పాటు సాంస్కృతి కేంద్రంగా విలసిల్లాలని ఆకాంక్షించారు. సూర్యాపేటలో బ్రాహ్మణ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఖమ్మం, మధిర, బీచుపల్లిలోనూ నిర్మిస్తామన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు, పండితులతో చండీయాగం నిర్వహించారు. అందరి ఆశీర్వచనాలు తీసుకున్న కేసీఆర్ పీఠాధిపతులను ఘనంగా సత్కరించారు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దేవాలయాలకు వైభవం తెచ్చాం : కాశీలోని రాష్ట్ర యాత్రికులకు త్వరలోనే అక్కడ తెలంగాణ భవన్ నిర్మించనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఇందుకోసం త్వరలోనే స్థల సేకరణ జరుపుతామని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దేవాలయాలకు వైభవం తెచ్చామని పేర్కొన్నారు. పునర్నిర్మాణంతో యాదాద్రికి వైభవం వచ్చిందని అన్నారు. వేములవాడ, కొండగట్టు, కురవి ఆలయాల్లోనూ అభివృద్ధి పనులు చేపట్టినట్లు శాంతికుమారి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, మేయర్ విజయలక్ష్మి, ఎంపీ రంజిత్ రెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేవీ రమణాచారి, రాజీవ్‌శర్మ, పీఠాధిపతులు, పండితులు తదితరులు పాల్గొన్నారు.

భక్తి, ఆధ్మాత్మిక భావజాల వ్యాప్తికి సంబంధించిన సమస్త సమాచార కేంద్రంగా, రిసోర్స్‌ సెంటర్‌గా ఈ భవనం సేవలందించనుంది. మరోవైపు రాష్ట్రంలోని బ్రాహ్మణుల సర్వతోముఖాభివృద్ధి కోసం 18 మంది సభ్యులతో కూడిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి రిటైర్డ్‌ ఐఎఎస్‌ కేవీ రమణాచారి సారథ్యం వహిస్తున్నారు. పరిషత్తు ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తున్నారు.

ఇవీ చదవండి :

pujyo app: ఆన్​లైన్​లో పిలిస్తే ఇంటికే రానున్న పురోహితులు

Last Updated : May 31, 2023, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.