రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ ప్రాంగణం ప్రవేశ ద్వారం వద్ద జయశంకర్ విగ్రహానికి పీజేటీఎస్‌ఏయూ ఉపకులపతి డా.ప్రవీణ్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. వర్సిటీ రిజిస్ట్రార్ డా.సుధీర్ కుమార్‌తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.
మరింత చేరువయ్యేందుకు...
బోధన, బోధనేతర సిబ్బంది, పొరుగు సేవల ఉద్యోగులు కూడా ఘనంగా నివాళులర్పించారు. కొవిడ్-19 నేపథ్యంలో రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగం, అన్నదాతలకు మరింత చేరువయ్యేందుకు వ్యవసాయ బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో మరింత దూసుకెళ్లేందుకు తాము కృషి చేస్తున్నామని వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు అన్నారు. కరోనా ముందు... కరోనా తర్వాత... అన్న రీతిలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు.