ETV Bharat / state

'ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసిన నాయకుడు మాకు వద్దు'

author img

By

Published : Jul 26, 2020, 8:24 PM IST

Updated : Jul 26, 2020, 10:03 PM IST

ప్రభుత్వ భూములను కబ్జా చేసి విక్రయించిన నాయకుడు కో-ఆప్షన్​ పదనికి అర్హుడు కాదంటూ రంగారెడ్డి జిల్లా జల్​పల్లి గ్రామస్థులు ఆరోపించారు. తెరాస అభ్యర్థిగా నామినేషన్​ వేసిన సురెడ్డి కృష్ణారెడ్డికి పదవిని కట్టబెట్టవద్దంటూ వారు డిమాండ్​ చేశారు.

jalpally villagers demand to remove the trs candidate krishna reddy nomination for co option position
'ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసిన నాయకుడు మాకు వద్దు'

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న కో-ఆప్షన్ ఎన్నికలకు సంబంధించి తెరాస అభ్యర్థిగా నామినేషన్ వేసిన సురెడ్డి కృష్ణా రెడ్డికి పదవి ఇవ్వద్దంటూ గ్రామస్థులు డిమాండ్​ చేశారు. తాను 25 ఏళ్లు గ్రామ సర్పంచ్​గా ఉంటూ ప్రభుత్వ భూములు కాపుడుకుంటూ వచ్చానని కానీ కో ఆప్షన్ పదవి కోసం నామినేషన్ వేసిన సురెడ్డి కృష్ణా రెడ్డి కొన్ని ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమ్ముకున్నట్లు మాజీ గ్రామ సర్పంచ్ కట్టెల రాములు తెలిపారు. భూములను కబ్జా చేసి అమ్మినట్లు దస్తావేజులు కూడా చూయించారు.

ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వ్యక్తి కో-ఆప్షన్ పదవికి అర్హుడు కాదని అలాంటి వారికి పదవి రాకుండా చూడాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పలువురు గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

Last Updated : Jul 26, 2020, 10:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.