ETV Bharat / state

MLA Kishan Reddy: నాలా విస్తరణ పనులను త్వరలోనే పూర్తి చేస్తాం: కిషన్ రెడ్డి

Strategic Nala Development Program మురుగు నీటిని తరలించే నాలాల విస్తరణ పనులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలోని కుంట్లూర్ నుంచి మూసీ వరకు నీటిని తరలించే ప్రక్రియను అధికారులతో కలిసి ఆరా తీశారు.

MLA Kishan Reddy
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
author img

By

Published : Mar 24, 2022, 5:09 AM IST

Strategic Nala Development Program మురుగు నీటిని తరలించే నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా కుంట్లూర్​లో జరుగుతున్న మురుగు నీటిని తరలించే పనుల ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించారు. ఇప్పటికే 14.5 కోట్ల రూపయల పనుల కాగా.. మరో పనులను దాదాపు 32.5 కోట్ల రూపాయలతో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

పెద్ద అంబర్​పేట్​ మున్సిపాలిటీ పరిధి కుంట్లూర్​లోని భూదాన్ కాలనీలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మురికినీటి పైప్​లైన్​ను పరిశీలించారు. జీహెచ్ఎంసీ నుంచి వచ్చే మురికినీటిని పసుమాముల, తారామతిపేట్ మీదుగా మూసీలో కలిపే ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ చెవుల స్వప్న, ఎస్​ఎన్​డీపీ చీఫ్ ఇంజనీర్ కిషన్, సూపరిండెంటెండ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ అమరేందర్, మున్సిపల్ డీవై, ఈఈ అశోక్, తెరాస మున్సిపల్ అధ్యక్షుడు సిద్దంకి కృష్ణా రెడ్డి, కౌన్సెలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.