రాజేంద్రనగర్లోని రాష్ట్ర పోలీసు అకాడమీలో సిబ్బందికి ఫైరింగ్పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నగర సీపీ అంజనీకుమార్ ఫైరింగ్పై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఏడాది నిర్వహించే ఫైరింగ్ సాధనలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అధికారులందరూ హాజరయ్యారు.
9ఎంఎం గ్లాక్, ఏకే 47, ఎంపి5 సబ్ మిషన్ తుపాకులపై అధికారులు చాలాసేపు సాధన చేశారు. సాధనలో భాగంగా సీపీ ఫైరింగ్ చేస్తూ సిబ్బందికి మెళకువలు నేర్పారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ స్థాయి నుంచి పోలీసు అధికారులు పాల్గొన్నారు.